ఎల్బీనగర్: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని లింగోజిగూడ ఓల్డ్ విలేజ్ కు చెందిన సీహెచ్ శ్రీనివాస్ కు మంజూరైన 60 వేల చెక్కును శనివారం రాజశేఖర్ రెడ్డి అందజేసి మాట్లాడారు. అర్హులంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, కిట్టు, రమణ, కరుణ్ కుమార్, యశ్వంత్, ఆనందారాజ్, రాంబాబు, సతీష్, శ్రీధర్ గౌడ్, గౌస్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி