వికారాబాద్: బాలుడి కిడ్నాప్‌కు యత్నం.. చితకబాదిన స్థానికులు

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం యోన్కెపల్లిలో బాలుడు కిడ్నాప్ చేసేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. రోడ్డు పక్కన వెళ్తున్న 8 ఏళ్ల బాలుడిని దుండగుడు కిడ్నాప్ చేశాడు. పెర్కంపల్లి తండాలో బాలుడితో అనుమానాస్పదంగా కిడ్నాపర్ ఉన్నట్లు స్థానికులు గురించారు. స్థానికులు కిడ్నాపర్‌ను నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో కిడ్నాపర్‌కు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు పట్టించారు. కిడ్నాపర్‌ కొడంగల్ (మం) పర్సాపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

தொடர்புடைய செய்தி