ఖైరతాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో అగ్నిప్రమాదం

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని శ్రీరాంనగర్ బస్తీలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. నివాసాల మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో ఒక్కసారిగా మంటలు రావడంతో జనం పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించినట్లు అధికారులు గుర్తించారు.

தொடர்புடைய செய்தி