ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన హయత్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. రంగనాయకుల గుట్ట సుధీర్ కుమార్ కాలనీకి చెందిన సోరపు వెంకన్న పెయింటర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఇంట్లో చిన్న చిన్న తగాదాల కారణంగా కొంత కాలంగా పెద్ద అంబర్ పేట్ లో ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ సమీపంలో కూర్చున్న చోటనే కుప్పకూలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్య పూలమ్మ తన భర్త మృతిపై విచారణ చేయాలని ఫిర్యాదు చేసింది.

தொடர்புடைய செய்தி