చేవెళ్ల నియోజకవర్గం అలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రానికి తేమ తక్కువ ఉండి, చెత్తాచెదారం లేని నాణ్యతగల పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు దళారులకు పత్తిని విక్రయించి మోసపోవద్దని సూచించారు.