TG: మురసు తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, ములుగు, హన్మకొండ, వరంగల్, యాదాద్రి, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.