TG: రాష్ట్ర ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించనుంది. భూ ఉపరితలం వేడెక్కిన ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 km వేగంతో ఈదురుగాలులు, NZB, KMD, MDK, SRD జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, VKB, MBNR జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేసింది.