ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. RCB ఇచ్చిన 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో ఛేదించింది. DC బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (93) అర్థశతకంతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ 2, సుయాష్, యష్ దయాల్ తలో వికెట్ తీశారు.