తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఐదుగురి పేర్లతో జాబితాను రూపొందించి రాహుల్ గాంధీని సంప్రదించారు. అయితే ఈ జాబితాలో కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి పేరుపైన ఆయన అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. తన నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని రేవంత్ రెడ్డికి సూచించినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.