ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్‌కు పీవీ సింధు (VIDEO)

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి హినా అకేచిపై 21-10, 20-22, 21-16తో విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ దక్షిణ కొరియా షట్లర్‌ ఆన్‌ సే యంగ్‌తో సింధు తలపడనుంది. ఈ ఏడాది సూపర్‌ 750 టోర్నీలో సింధు ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. గత జులైలో జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టైటిల్‌ను గెలుచుకుని తొలి భారత షట్లర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.
Video Credit: Pitch & Court

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕