IOA అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న PT ఉష

భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని దిగ్గజ స్ప్రింటర్ పీటీ ఉష స్పష్టం చేశారు. ఐఓఏ అధ్యక్షురాలిగా ఆమె పదవీకాలం డిసెంబర్ 5తో అధికారికంగా ముగియనుంది. అదే రోజున నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించనుంది. పరిపాలనాపరమైన విభేదాల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. భారత క్రీడా చరిత్రలో ఐఓఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా, తొలి ఒలింపియన్‌గా ఆమె ప్రత్యేక గుర్తింపును పొందారు. ఈ మార్పుతో భారత క్రీడా సంఘంలో కొత్త అధ్యాయం మొదలవ్వనుంది.

தொடர்புடைய செய்தி

✕
✕