SLBC టన్నెల్‌ ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద శనివారం జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి ఫోన్‌ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం తెలిపారు. కాగా, ఇప్పటికే NDRF, SDRF బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

தொடர்புடைய செய்தி