ఇది ఎల్-నినో ప్రభావం కాదు.. ఎల్-కాంగ్రెస్ ప్రభావం: కేటీఆర్

తెలంగాణలో విద్యుత్ కోతలకు ఎల్‌నినో కారణం కాదని, అది 'ఎల్ కాంగ్రెస్' ప్రభావమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎల్‌నినో వల్లే కరెంట్ కోతలున్నాయని చెప్పడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. కాంగ్రెస్ పాలన వల్లే ఈ సమస్య వచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలోనే కరెంట్ లేక రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

தொடர்புடைய செய்தி

✕
✕