ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ అయిన రాహుల్ గాంధీని కలవడానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మరోవైపు, బ్రిటీష్ కౌన్సిల్ సమీపంలో ఎంపీలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డికి కూడా లాఠీ దెబ్బలు తగిలాయి. SIRను రద్దు చేయాలని, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.