ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని బనస్కాంతలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 24వ విడత నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రైతులు తమ చెల్లింపు వివరాలు, ఖాతా స్థితిని అధికారిక పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. రైతులు 'Farmers Corner'లో 'Know Your Status' ఆప్షన్‌ను ఎంచుకుని, తమ ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌తో వివరాలు చూడవచ్చు. ఈ-కేవైసీ, భూమి వివరాల ధృవీకరణ, అర్హత 'Yes' అని ఉన్నాయో లేదో తప్పనిసరిగా సరిచూసుకోవాలి.