అమెరికా మార్కెట్లో సోమవారం ఎన్విడియా షేర్లు భారీగా పడిపోయాయి. సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్ చైనా గూఢచర్య ప్రయత్నానికి లక్ష్యంగా మారారనే ఆరోపణలు, వ్యక్తిగత వ్యవహారాల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ పరిణామంతో ఎన్విడియా మార్కెట్ విలువ 335 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. కంపెనీ విలువ 4.5 ట్రిలియన్ డాలర్ల నుండి 4.16 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది.