నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గురువారం, రహదారి పక్కన ఉన్న దుకాణ సముదాయాలను సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తొలగించారు. వాహనాల రద్దీ, ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ఈ దుకాణాలను వెనుకనున్న ఖాళీ ప్రదేశంలోకి తరలించారు. ఈ చర్యతో రహదారి విస్తరణ జరిగి, వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.