తానూర్: వైభవంగా విఠలరుక్మిణి రథోత్సవం

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తానూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి విట్టలరుక్మిణి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ముందుగా ఆలయంలో దేవత మూర్తులకు తులసి పూజ చేశారు. ఆలయ పూజారి సచిన్ పాఠక్ దేవతలను ప్రత్యేకంగా అలంకరించి, హారతి ఇచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయం నుంచి రథాన్ని గ్రామంలోని వీధుల్లో ఊరేగించారు. గ్రామస్థులు పెద్దఎత్తున ఉత్సవంలో పాల్గొని దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி