తానూర్: అంగన్వాడీ సెంటర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తానూర్ మండల కేంద్రమైన తానూర్ లోని 5వ అంగన్వాడీ సెంటర్ లో సోమవారం అంగన్వాడీ టీచర్లు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మ లను పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. దింతో అంగన్వాడీ కేంద్రం వద్ద బతుకమ్మ పండుగ శోభా సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అనిత, అంగన్‌వాడీ టీచర్లు సావిత్ర బాయి, మనిషా, పవార్ వందన తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி