నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ శివారులో గల రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఐకెపి వివో ఎ ల కనీస వేతనం 26వేల రూపాయలు పెంచాలని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 10 లక్షల సాధారణ భీమా సెర్పు నుండి ఐడి కార్డులు జారీ చేయాలని, అర్హులైన వివోఏ లకు సీసీ ప్రమోషన్ ఇవ్వాలని అభయ హస్తం డబ్బులు గవర్నమెంట్ డబ్బులు చెల్లించాలి అని లక్ష్మీనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కోరికలు నెరవేర్చాలని తమ డిమాండ్లు సాధనకై ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నరసింహ స్వామి ఐకెపి వివోఏల అధ్యక్షుడు రమణారెడ్డి సంగీత, పోశెట్టి, శ్రీనివాస్ సాయన్న, రాములు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.