బాసర అర్జీయూకేటి లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆర్జీయూకేటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఆర్జీయూకేటి ముట్టడికి వచ్చిన వివిధ ప్రాంతాల నాయకులను ఉదయం నుండి పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రచారంలో ఉన్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హుటాహుటినా ముధోల్ పోలీసు స్టేషన్ చేరుకొని పోలీసు అధికారులతో మాట్లాడి అరెస్టు అయిన నాయకులను విడుదల చేయించారు.