కుంటాల: ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదని రైతుల ధర్నా

లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రంలో కొనుగోళ్లు జరపడం లేదని రైతులు గురువారం కుంటాల మండలం ఆర్లి X రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు. కొనుగోళ్ల కేంద్రాల్లో ధాన్యం పోసి ఇప్పటికే 45 రోజులు పూర్తి కావస్తున్నా కొనుగోళ్లు జరపడం లేదని మండిపడ్డారు. పనులను వదులుకొని కళ్ళల వద్ద పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி