మహారాష్ట్రలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కుబీర్ మండల సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలోని భోకర్ తాలూకా పాలజ్ గ్రామంలో ఏర్పటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయ చౌహాన్ మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మోదీ పాలనలో 10 సంవత్సరాలుగా దేశం అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రతి ఒక్కరు బీజేపీ ఓటు వేసి గెలిపించాలని కోరారు.