కుబీర్: కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని డోదర్నా తండా 2 కు చెందిన చౌహన్ గులాబీ గత కొంత కాలంగా కడుపు నోప్పితో బాధపడుతున్నాడు. నొప్పి తీవ్రం కావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుమారుడు గణేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி