రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్షమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించుకుని భైంసా మండలం మాటేగాంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలొచ్చినా డబుల్ బెడ్రూం, ఉద్యోగాలు ఇస్తామని మాయ మాటలు చెప్పి ముందుకు సాగేదన్నారు. రైతులను రాజు చెయ్యాలని గిట్టు బాటు ధరలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.