పడిపోయిన చెట్టు, విద్యుత్ స్తంభం

జన్నారం పట్టణంలో వీస్తున్న భారీ ఈదురు గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోతున్నాయి. మంగళవారం 3 గంటలకు ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో జన్నారం పట్టణంలోని మేదరి వాడ ఎఫ్డిఓ కార్యాలయం నుండి బస్టాండ్ వెళ్లే మార్గంలో ఒక చెట్టు, విద్యుత్ స్తంభం పడిపోయాయి. అలాగే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలలో స్తంభాలు చెట్లు పడిపోయాయి.

தொடர்புடைய செய்தி