తెలంగాణలో కొత్త రైళ్లు కూత పెట్టనున్నట్లు రాష్ట్ర బీజేపీ 'X' వేదికగా ట్వీట్ చేసింది. రూ.5,071 కోట్లతో కొత్త లైన్ల నిర్మాణం, విద్యుద్దీకరణ, డబ్లింగ్ పనులు కేంద్రం చేస్తుందని తెలిపింది. 'కాంగ్రెస్తో పోల్చితే ఎన్డీఏ హయాంలో పదేళ్లలో 20% పెరిగిన బడ్జెట్ కేటాయింపులు. కొత్త స్టేషన్ల నిర్మాణంలో, కొత్త రైళ్లు తెలంగాణకు రావడంతో కేంద్రం కృషి మోదీజీ సారథ్యంలో మారిన తెలంగాణ రైల్వే రూపురేఖలు' అని పేర్కొంది.