దేశంలోని ఎనిమిది హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు ఈ నియామకాలు జరిగాయి. జస్టిస్ వి.కామేశ్వరరావు (పట్నా), జస్టిస్ రవీంద్ర వి ఘుగే (కలకత్తా), జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి (బాంబే) సహా ఎనిమిది మంది కొత్త సీజేలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ హైకోర్టు సీజే నియామకం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.