లక్నోలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన 15 రోజులకే నవ వధువు ఉపాసన సింగ్ (27) హత్యకు గురైంది. మృతురాలి అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధించారని తండ్రి తెలిపారు. ఆమె చనిపోయే వరకు వారు ఉపాసనను కొట్టినట్లు తెలుస్తోంది. యువతి మెడప, శరీరంపై గాయాలును పోలీసులు గుర్తించారు. తండ్రి కృష్ణ కుమార్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.