నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటిఐ ఆవరణలో నిర్మిస్తున్న బాలుర అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కేంద్రాన్ని డిసెంబరు 4 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె ఏటీసీ నిర్మాణాన్ని పరిశీలించారు. టాటా కన్సల్టెన్సీ తో బాలురు, బాలికల ఏటీసీ కేంద్రాల నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డిసెంబర్ 4లోగా బాలుర స్కిల్ సెంటర్ ను పూర్తి చేయాలని ఆదేశించారు.