నల్గొండ పట్టణంలోని ఇంద్రారెడ్డి రైస్ మిల్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకును చూసుకోకుండా మరో బైక్ వ్యక్తి రోడ్డు క్రాస్ చేసే క్రమంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.