నాంపల్లి గ్రామంలో ఒకేసారి వందలాది కోతులు సంచరించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జనవాసాల్లో తిరుగుతూ ఇళ్లు, షాపులలో దొరికిన వస్తువులను పట్టుకుని పరారవుతున్నాయి. వేసవి కావడంతో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో నీటి కోసం గ్రామాల్లోకి వచ్చాయని పలువురు చెబుతున్నారు. అధికారులు రోడ్లపై గుంపులుగా తిరుగుతున్న కోతులను బంధించి వేరే ప్రాంతాలకు తరలించాలని ప్రజలు సోమవారం కోరుతున్నారు.