నల్లగొండ: మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే

వాహనదారులు మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే అని వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని దేవరకొండ రోడ్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద మద్యపానం సేవించిన 10 మంది, సరైన పత్రాలు లేని 27 మందిపై కేసులు నమోదు చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానితోపాటు తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వారి వెంట పలువురు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

தொடர்புடைய செய்தி