అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం అన్నారు. మంగళవారం సుందరయ్య భవన్ లో సిపిఎం పట్టణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ గత నెల రోజులుగా 20 శాఖల మహాసభలు నిర్వహించుకుని ఆదివారం నల్గొండ పట్టణ మహాసభ ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణంలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను గుర్తించి పలు తీర్మానాలు చేసి పోరాటాల కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు.

தொடர்புடைய செய்தி