రేపటిలోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాలి

రేపటి( బుధవారం) సాయంత్రంలోగా జిల్లాలో ప్రతిపాదించిన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వివిధ అంశాలపై జిల్లా , మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వానకాలం ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 375 కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రతిపాదించడం జరిగిందని, వాటన్నింటిని బుధవారం సాయంత్రంలోగా ప్రారంభించాలని కలెక్టర్ అన్నారు.

தொடர்புடைய செய்தி