మునుగోడు మండలం పులిపలుపుల గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. ఈ మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అర్హులైన తమ పేర్లు లేవని వారు ఆగ్రహం చేశారు. అనర్హులకు పథకాలు ఎంపిక చేశారని మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మరుగున పడేస్తారని మండిపడ్డారు.