అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పీఏపల్లి మండలం అజ్మాపురం శివారులో జరిగింది. ఎస్సై నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నమునిగల్ కు చెందిన అరవింద్ (27) పుష్కర్ ఘాట్ వద్ద పురుగుల మందు తాగి భార్యకు వీడియో కాల్ చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు ఘాట్ వద్దకు చేరుకొని అరవింద్ ను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.