హైదరాబాద్ విస్తరణ పరిధి పెరగనుంది. హెచ్‌ఎండిఎ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ (HMR)ను ప్రభుత్వం తీసుకురానుంది. త్వరలో RRR అందుబాటులోకి రానుండడంతో ఫ్యూచర్‌లో అవసరాల కోసం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలోని 162 గ్రామాలను హెచ్ఎంఆర్ పరిధిలోకి ప్రభుత్వం తీసుకురానుంది. సెమీ అర్బన్ గా పరిగణిస్తూ వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.