అమెరికాలో నల్గొండ యువతి మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మాన్వితా రెడ్డి (27) క్యాన్సర్‌తో పోరాడి మరణించారు. దాదాపు రెండు నెలలపాటు అనారోగ్యంతో బాధపడిన ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన మాన్విత, మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో ఉంటున్నారు. ఆమె మరణవార్తతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

தொடர்புடைய செய்தி

✕
✕