ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ జీ స్క్వాడ్ సంస్థతో కలిసి కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. దీపావళి సందర్భంగా 'RX' అనే టైటిల్ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సత్యం కోసం సాగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సంకేతాలు ఇచ్చారు. విశాల్ వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, నాజర్, రమేష్ తిలక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది.