AP: విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న ప్రియుడిని ప్రియురాలు హత్య చేసింది. తలపై ఇనుప రాడ్తో కొట్టి, ఆపై యాసిడ్ పోసి శ్రీను అనే వ్యక్తిని రాములమ్మ అనే మహిళ హతమార్చింది. ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రం కావడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం రాములమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.