త్వరలో 14 వేలకు పైగా అంగన్వాడీ ఉద్యోగాలు: సీతక్క

బీజేపీ 11 సంవత్సరాల్లో మీ గ్రామాల్లో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చింది? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. త్వరలో 14 వేలకు పైగా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు. వివిధ శాఖల్లో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టబోతున్నామని తెలిపారు. బీజేపీకి తెలిసిందల్లా విద్వేషాలు రెచ్చగొట్టడమేనని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி