సీఈసీని కాపాడేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. SIR ప్రక్రియలో సాఫ్ట్వేర్ వివరాలను కోరితే, ట్రేడ్ సీక్రెట్స్ పేరుతో ఎన్నికల కమిషన్ వాటిని ఇవ్వడానికి నిరాకరించిందని అన్నారు. ఈ క్రమంలో CEC జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, CECకి రక్షణ కల్పిస్తున్న 2023 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.