ఖతార్‌కు ఉత్తరాన ఆయిల్ ట్యాంకర్‌పై మిసైళ్ల దాడి

గల్ఫ్‌ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. ఖతార్‌కు ఉత్తరాన ‘ఏకర్స్‌’ అనే ఆయిల్‌, కెమికల్‌ ట్యాంకర్‌పై శనివారం పలు మిసైళ్లు దూసుకెళ్లినట్లు యూకేఎంటీవో తెలిపింది. ఈ ఘటనలో కొందరు సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం. ఆంటిగ్వా అండ్‌ బార్బుడా జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌక హోర్ముజ్‌ జలసంధి వైపు వెళ్తుండగా దాడి జరిగింది. మరోవైపు, ఫుజైరాకు తూర్పున ‘ధల్కుత్‌’ ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. తాజా ఘటనలతో అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

தொடர்புடைய செய்தி

✕
✕