AP: సొంత ఇల్లు లేని వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులందరికీ ఇండ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కోనసీమలోని రామచంద్రాపురం రూరల్, మున్సిపాలిటీ, కె.గంగవరం, కాజులూరు మండలాల్లో ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి రూ.2,50,000 మంజూరు చేసిందన్నారు. ఎస్సీ, చేనేత కుటుంబాలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు అదనంగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.