తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని సూచించారు. నార్లాపూర్, ఏదుల జలాశయాల మధ్య రెండో ప్యాకేజీని త్వరగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. కాలువల పనులను తక్షణమే చేపట్టి అక్టోబర్ వరకు పూర్తి చేస్తామన్నారు.