బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో పాల్గొన్న మంత్రి సీత‌క్క‌

అమ్మాయిలను బతకనీయండి.. చదవనీయండి.. ఎదగనీయండి అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ‘‘బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ. ఆడబిడ్డలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు. బతుకమ్మను, చెరువులను భవిష్యత్ తరాలకు అందిద్దాం. తద్వారా ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని కాపాడుదాం’’ అని అన్నారు.

தொடர்புடைய செய்தி