సర్వే తీరును పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్న మెదక్ కలెక్టర్

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్థిక, సామాజిక, కుటుంబ సర్వే కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. సర్వే తీరును ఆయన పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సామాజిక సర్వే పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி