నర్సాపూర్: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టం: మాజీ మంత్రి

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కుల్చారం మండలం చిన్న గణపురంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శనివారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. చిన్న గణపురంలో ఈ రోజు తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి అన్నారు.

தொடர்புடைய செய்தி