మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ముందు ప్రయాణికులు సోమవారం ధర్నా చేపట్టారు. ఆర్టీసీ అధికారులు పల్లె వెలుగు బస్సులు ఏర్పాటు చేసి దాంట్లో స్పెషల్ బస్సుల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుడు ప్రయాణం చేయాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.